టాలీవుడ్ హీరోలు ఈమధ్య ఒకే సారి రెండు మూడు సినిమాలను తెరకెక్కిస్తు గతంలో ఎప్పుడూ లేని విధంగా తమ జోరును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఈ తరహా లో ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు. అలా రవితేజ కూడా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లి వరుస సినిమాలతో తమ దూకుడును తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, వెంకటేష్ వంటి పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచారు. 

వారికి తాను ఏం తీసుపోను అంటూ రవితేజ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ తన తదుపరి చిత్రంగా రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల షూట్ చేస్తే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారట.  మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.  అనసూయ ముఖ్య పాత్ర చేస్తోంది. రవితేజ ను రెండు డిఫరెంట్ షేడ్స్ లో చూపించబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీర సినిమా రాగా ఆ సినిమా కొంత నిరాశ పరచడంతో ఈ సినిమా ను తప్పకుండా హిట్ చేయాలని రమేష్ వర్మ భావిస్తున్నారు.  ఇక ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు.  ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రవితేజ. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఒక హీరోయిన్ గా  దివ్యాంశ కౌశిక్ కాగా,  మరొక హీరోయిన్ నీ వెతుకుతున్నారు. 1990 కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా గా తెరకెక్కబోతుంది. ఈ సినిమానే కాకుండా మరొక మాస్ చిత్రాన్ని బోయపాటి శ్రీను తో కలిసి చేస్తున్నారు రవితేజ.  మొత్తంగా రవితేజ దూకుడు మాములుగా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: