సినిమా ఇండస్ట్రీ లో గాసిప్పులు ఎంత దారుణంగా ఉంటాయి అంటే ఒక హీరో హీరోయిన్ అనే కాకుండా ఒక ఆడ మగా మధ్య  పరిచయం, మాటలు ఉన్న కూడా వారిద్దరికీ అక్రమ సంబంధాన్ని అంటగట్టడం చేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖలలో ఏ రెండు శాఖలకు చెందిన ఆడమగ మాట్లాడుకున్నా, బయటకు వెళ్ళినా, ప్రేమించుకుంటున్నారని ఎఫైర్ నడుస్తుందని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు ప్రచారం చేశారు.. టాలీవుడ్ లో టాప్ సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీప్రసాద్, టాప్ హీరోయిన్ అయిన చార్మీ లకు మధ్య ఎఫైర్ నడుస్తుందని ప్రచారం బాగా జరిగింది.

సంగీత దర్శకుడిగా తనేంటో తన పనితనం ఏంటో దేవిశ్రీప్రసాద్ ప్రేక్షకులకు చూపించాడు. తెలుగునాట మాత్రమే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా దేవిశ్రీప్రసాద్ తన పాటలతో అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా దేవిశ్రీ ప్రసాద్ కి ఆయన సంగీతానికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇతర సంగీత దర్శకులతో పోటీపడుతూ సినిమాలను చేస్తూ స్టార్ హీరోల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో ప్రతి హీరో కూడా ఆయనతో సినిమా మళ్లీ మళ్లీ చేయాలని చూసేవారు. 

ఇక ఛార్మీ కూడా హీరోయిన్ గా కొన్ని సినిమాలతో సక్సెస్ ను సాధించి గ్లామర్ షో లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నటిగా తన కెరీర్ కి స్వస్తి చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. అయితే వీరిద్దరికి ప్రేమ వ్యవహరం గతంలో బెడిసి కొట్టిందనే ప్రచారం కాగా ఆ కారణంగానే ఇప్పటికీ వీరిద్దరూ బ్యాచ్ లర్ గా  జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.   నిజానికి ఇప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోక పోవడం కొంత అనుమానానికి దారితీస్తుంది.  దేవిశ్రీప్రసాద్ 40 ఏళ్ల కు దగ్గరగా వస్తున్న పెళ్లి చేసుకోలేదు. చార్మి కూడా ఇంచుమించు అదే వయసు. మరి వీరిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అనేది వారు చెబితే గాని ఎవరికీ తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: