టాలీవుడ్ లో మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న క్రేజీ కాంబినేషన్స్ లో మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అప్పుడే తారా స్థాయికి చేరాయి.అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఏ వార్త వచ్చినా అది ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారుతుంది.ఇదిలా ఉంటె ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట'చిత్రంలో నటిస్తున్నాడు.14రీల్స్ పతాకం పై రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు మహేష్. ఇక మరోవైపు త్రివిక్రమ్ మాత్రం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసాడు.ఇదిలా ఉంటె సాధారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయి.. కొంత వరకు ముందుకు సాగిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తన పనిని మొదలు పెడతాడు.సినిమా షూటింగ్ అనేది మధ్య దశలో ఉండగా అప్పుడు పాటలు రెడీ అవుతూ ఉంటాయి.మహేష్, త్రివిక్రమ్సినిమా పట్ల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందే పాటలు రెడీ చేసేసాడట థమన్.ఇక తాజాగా క్లబ్ హౌజ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న థమన్..

త్రివిక్రమ్,మహేష్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.సినిమాలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందనీ..సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని..ఇప్పటికే వాటిల్లో మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని వెల్లడించాడు థమన్.దాదాపు సినిమాకి సంబంధించిన అన్ని ట్యూన్స్ కూడా ఓకే అయిపోయాయని చెప్పుకొచ్చాడు ఈ యువ సంగీత దర్శకుడు.దీంతో ఇప్పుడు ఈ వార్త ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకుండానే మూడు పాటలు పూర్తవ్వడం ఏంటా అని.. థమన్ ఈ మధ్య మాంచి స్పీడ్ లో ఉన్నాడని అంటున్నారు సినీ విశ్లేషకులు.ఈఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకి సైతం తమనే స్వరాలు సమకూరుస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: