సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే అదృష్టమైన ఉండాలి లేదంటే సినిమా నేపథ్యం అయినా ఉండాలి ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం. ఎలాగోలా రాణించినా కూడా ఎక్కువ రోజులు నిలవడం ఇంకా కష్టం. ఆ విధంగా ఎంతో మంది హీరోలు హీరోయిన్లు అదృష్టం లేక సినిమా బ్యాక్ గ్రౌండ్ లేక వెనుదిరగగా ఇంకొంతమంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అదృష్టంతో ఎదిగిన వారు ఉన్నారు.

సినిమాలో ఛాన్స్ రాకముందు ఒక రకమైన కష్టమైతే చాన్స్ వచ్చాక ఇంకొక రకమైన కష్టం మొదలవుతుంది. అదేమిటంటే ఒక సారి హిట్ కొడితే పలకరించే అదే సినీ జనాలు ఫ్లాప్ వస్తే మాత్రం పట్టించుకోరు. అప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకటైతే ఫ్లాప్ వచ్చినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే మన సినిమా వాళ్లు ఫ్లాప్ సినిమాలకు దూరంగా ఉంటారు. హిట్ తో ఎంతో గుర్తింపు వస్తుందో ఫ్లాప్ తో అంత కంటే దారుణం స్థితిని ఎదుర్కొంటారు.

ఇదిలా ఉంటే 1998 లో విడుదలైన పెళ్ళికానుక సినిమా హీరోయిన్ మీకు గుర్తు ఉండే ఉంటుంది కదా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా నటించగా హీరోయిన్ గా లక్ష్మి నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తన నటనకు ప్రేక్షకుల దగ్గర్నుంచి ప్రముఖుల దగ్గర నుంచి మంచి మార్కులు వేయించుకొని స్టార్ హీరోయిన్ లక్షణాలను కొని తెచ్చుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఈమె తదుపరి సినిమా చేయడానికి చాలా కష్టాలు పడింది. కుటుంబ సమస్యలు రావడంతో ఆమె ఇండస్ట్రీని వదిలి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిందని తెలుస్తుంది.ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది.. ఏం చేస్తుంది.. దాని వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. మరి ఆమె ఎక్కడుందో ఆమె అభిమానులకు వెల్లడిస్తుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: