ఇక జబర్దస్త్ కామెడీ షోలో కూడా ఇదే జరుగుతుంది. ఆ షోలో చేసే ఒక్కో కమెడియన్ కి ఒక్కో టాలెంట్ ఉంది. ఇక జీవన్ డప్పు బాగా కాపాడుతారు. ఇక సుడిగాలి సుధీర్ అల్ రౌండర్. అలాగే గెటప్ శ్రీను అద్భుతమైన నటుడు. రీసెంట్ గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమ్మాన్యుయేల్, నూకరాజు మంచి సింగర్స్. అప్పారావు హరికథలు బాగా చెప్తుంటారు. అయితే అదిరే అభి టీమ్‌లో 8 ఏళ్ళుగా చేస్తున్న రాములోనూ ఓ మంచి టాలెంట్ దాగి ఉంది.
అయితే రాముకు కామెడీ రాదు.. ఎక్స్‌ప్రెషన్ కూడా ఇవ్వలేడని రోజాతో పాటు చాలా మంది సెటైర్లు వేస్తుంటారు. ఇక అది కూడా స్కిట్స్‌లో భాగంగానే జరుగుతుంది. రాములో మంచి కమెడియన్‌తో పాటు కొరియోగ్రఫర్ కూడా ఉన్నారు. ఇక ఇన్నేళ్లు జబర్దస్త్‌లో మాత్రమే డాన్సులు చేసిన రాము.. ఇప్పుడు కొరియోగ్రఫర్ గా మారారు. ఈటీవీలో ప్రతీ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం వస్తుంది.
ఈ ప్రోగ్రాంలో రాము కొరియోగ్రఫీలో ఓ పాట వచ్చింది. అయితే ఢీ డాన్సర్ పండుతో ఓ పాటను కంపోజ్ చేశారు రాము. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమాలోని ఐ గో క్రేజీ పాటను కంపోజ్ చేశారు. ఇక ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. రామ్ బాగా కొరియోగ్రఫీ చేసాడంటూ సుధీర్ సహా అక్కడున్న వాళ్లంతా ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఇన్నాళ్ళూ అదిరే అభి చాటుగా కనిపించినా రాము కూడా ఇన్నేళ్లకు తనలోని టాలెంట్ బయటపెట్టాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి