ఇక లేటెస్ట్ గా కింగ్ నాగార్జున చేస్తున్న బంగార్రాజులో కూడా అమ్మడు ఉంటుందని టాక్. సినిమాలో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టిని తీసుకోవాలని చూస్తున్నారట. నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న బంగార్రాజు సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట నాగార్జున. చైతుకి జోడీగా ఆమెని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్క సినిమాతో కృతి శెట్టి అరడజను దాకా సినిమాలు పట్టేసింది. టాలీవుడ్ లో మరో క్రేజీ హీరోయిన్ గా కృతి శెట్టి మారుతుందని చెప్పొచ్చు.
ఉప్పెన సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను మెప్పించింది. అందుకే అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫాం లో ఉన్న పూజా హెగ్దే, రష్మిలకు కూడా కృతి శెట్టి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. నాని, సుధీర్ బాబు సినిమాలు కూడా క్రేజీగా వస్తున్నాయి. ఆ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం కృతి శెట్టిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి