టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కి ఉన్న అభిమానం ఫ్యాన్ బేస్ ఏ దర్శకుడికి లేదనే చెప్పాలి. ఫ్లాప్ లు వచ్చినా కూడా పూరి జగన్నాథ్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన డైరెక్షన్ కి, డైలాగులకి, ఆయన వ్యక్తిత్వానికి కూడా చాలామంది అభిమానులుగా అయిపోయారు. తనలోని క్యారక్టర్ ను సినిమాల్లో చూపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కున్నారు పూరి జగన్నాథ్.


బద్రి లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. సౌత్ లో అన్ని భాషల్లో,  బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి పూరి జగన్నాథ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు. స్టార్ హీరోలు సైతం పూరి చేతిలో పడి మంచి హిట్ కొట్టాలని భావిస్తు ఉంటారు. 

ఇకపోతే పూరి జగన్నాథ్ కెరీర్ లో సూపర్ స్టార్ కృష్ణ తో సినిమా ను ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. పూరి జగన్నాథ్ టీవీ దర్శకుడిగా చేసిన రోజుల్లో ఆయన పనితనం నచ్చి ఐ బి కె మోహన్ ఆయనను సంప్రదించారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కృష్ణ ను కలిసి థిల్లనా అనే కథను ఒప్పించి సినిమా స్టార్ట్ చేశారు. సినిమా 1996 ఆఖరులో ప్రారంభించి షూటింగ్ చేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.మళ్లీ మొదలైన తిరిగి ఆగిపోయింది. దీంతో కృష్ణసినిమా నీ ముందుకు తీసుకు వెళ్ళ కూడదని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ తో పూరి మొదలుపెట్టిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తీసి హిట్ కొట్టారు.  ఆ తర్వాత ఆయన తనయుడితో పూరి జగన్నాధ్ పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: