కరోనా పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీలు అన్నీ సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నో కోట్ల బడ్జెట్ తీసిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. దీనికి కారణం థియేటర్లను మూసి వేయడమే. ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు, లాక్ డౌన్ ఎప్పుడు వేస్తారో తెలియదు. చాలా సినిమాలు మాత్రం షూటింగ్ లు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ చిన్న సినిమాలు ఓ టి టి లోనే విడుదలవుతున్నాయి. దీనితో ప్రముఖ హీరోలు మరియు హీరోయిన్లు సైతం ఓ టి టి లను నమ్ముకుని సాహసాలు చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్లు రకుల్ మరియు తమన్నాలు ఓ టి టి లలో తమ హవా కొనసాగిస్తుండగా, ఇప్పుడు సరికొత్తగా తమిళ హీరో శరత్ కుమార్ ఓ టి టి లో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయిపోయాడు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎప్పటి నుండో అనుకుంటున్నారట ఓ టి టి లో వెబ్ సిరీస్ చేయాలనీ, కానీ ఇన్ని రోజులు కరోనా కారణంగా కుదరలేదని తెలుస్తోంది. శరత్ కుమార్ దక్షిణాది భాషల్లో నటించి మంచి పవర్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ చేయడానికి అన్ని పనులు జరిగిపోయాయి. ఈ వెబ్ సిరీస్ కు "ఇరై" అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ సీనియర్ హీరోయిన్ మరియు శరత్ కుమార్ సతీమణి రాధికా శరత్ కుమార్ స్వయంగా నిర్మించనున్నారు. తన రాడాన్ సంస్థ ద్వారా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నట్లు అధికారిక సమాచారం.

ఈ వెబ్ సిరీస్ కు రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వ బాధ్యతలను తీసుకోనున్నాడు. ఇప్పటి వరకు రాజేష్ కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తోంది. ఈవెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోందని రాధికా శరత్ కుమార్ ఒక ప్రకటనలో తెలియచేశారు. అతి త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి ఓటిటి వేదికగా విడుదల చేయనున్నారు. అయితే ఏ ఓ టి టి లో విడుదల చేస్తారనే దానిపై సరైన సమాచారం లేదు. మరి సినిమాల లాగానే వెన్ సిరీస్ లోనూ శరత్ కుమార్ విజయాన్ని సాధించాలని కోరుకుందాం. అలాగే నిర్మాతగా రాధికా శరత్ కుమార్ కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: