సినిమాకు ప్రమోషన్స్ అనేవి ప్రాణం లాంటిది. ఎందుకంటే సినిమాలు ఎంత బాగా తీసినా సరైన పద్ధతిలో ప్రమోషన్ చేయనట్లయితే థియేటర్ల వద్ద బోల్తా పడవలసి వస్తుంది. అందుకు ఉదాహరణగా మనం చాలా సినిమాలను చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రమోషన్స్ అనేది న్యూస్ పేపర్స్, టీవీల ద్వారా, సినిమా థియేటర్ ల ద్వారా ఎక్కువగా జరిగేవి కానీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి అందుకనే సినిమా దర్శక నిర్మాతలు మరియు నటీనటులు ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ప్రమోషన్స్ కు వేదికగా ఎక్కువశాతం వాడుకుంటున్నారు. దానికి కారణం ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న మాధ్యమం అంతేకాక ప్రస్తుతం యువత ఎక్కువశాతం సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉండడంవల్ల, వీరు చెప్పాలనుకున్న విషయం అతి తొందరగా వీక్షకులకు చేరుతుంది. సోషల్ మీడియా లో కూడా ఒకే రకమైన పద్ధతిలో ప్రమోషన్ చేసినట్లయితే జనాలు పెద్దగా పట్టించుకోరు. అందుకని చిత్రబృందాలు వివిధ రాకాలుగా ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ రకమైన  ప్రమోషన్స్ తో ఆకట్టుకోవడానికి నటి కృతికర్బంధ కూడా ప్రయత్నిస్తోంది. సుమంత్ హీరోగా నటించిన 'బోని' సినిమాతో వెండితెరకు పరిచయమై ఆ తర్వాత 'ఒంగోలు గిత్త,తీన్మార్, బ్రూస్ లీ' లాంటి పలు చిత్రాల్లో నటించినా కానీ ఆమెకు పెద్దగా ఆదరణ లభించలేదు. దాంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ తనకు ఆఫర్లు పర్వాలేదు అనిపించుకునే విధంగా రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ నటి '14 పేరే  అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి  ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నేను నటించిన '14 పేరే' సినిమా ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశాం... ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇందులో కొన్ని సీన్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మీకు ఆ ట్రైలర్ లో ఏ సన్నివేశాలు అయితే బాగా న‌చ్చాయో వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయండి. వాటికి 14 పేరే అనే యాష్ టాగ్ ను వాడండి. మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే అయితే మనం అందరం కలిసి జూమ్ కాల్ లో మాట్లాడుకుందాం. అంటూ కృతి క‌ర్భందా అభిమానుల‌కు బంపరాఫ‌ర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: