'చెన్నై ఎక్స్‌ప్రెస్' వరకు షారుఖ్ ఖాన్ సినీ లైఫ్ బాగానే జరిగింది. అయితే ఈ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ వరుసగా ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది. 'దిల్ వాలే, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో' ఫ్లాపులతో షారుఖ్ మార్కెట్ కూడా పడిపోయింది. ఇక సొంత బ్యానర్‌లో చేసిన 'జీరో' డిజాస్టర్‌తో షారుఖ్ మూడేళ్లపాటు సినిమాలకి దూరమయ్యాడు.
షారుఖ్ ఖాన్ 'పఠాన్' అనే సినిమాతో మళ్లీ జనాలముందుకొస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై బాద్‌షా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అలాగే సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో 'ఇన్షాఅల్లా' అనే సినిమా కూడా చెయ్యాలనుకున్నాడు. ఆలియా భట్, షారుఖ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు భన్సాలి, షారుఖ్ ప్లేస్‌లో హృతిక్‌ని తీసుకుంటున్నాడట.
షారుఖ్ ఖాన్‌కి పెద్దగా మార్కెట్ లేదు.. వరుసఫ్లాపులతో గ్రాఫ్ పడిపోయింది. అందుకే షారుఖ్‌ని పక్కనపెట్టి, హృతిక్ రోషన్‌ని తీసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. అంతేకాదు, ఇక షారుఖ్ పనైపోయిందని, అర్జంట్‌గా హిట్ కొట్టకపోతే అంతే సంగతులని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ కష్టకాలం నుంచి షారుఖ్ ఎలా బయటపడతాడో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి