టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజనుకు పైగా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్,  వైష్ణవ్ తేజ్,  అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ్ లు హీరో లుగా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తమకే దక్కే గుర్తింపుతో అభిమానాన్ని సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు. వీరు లో అందరూ తమ తమ టాలెంట్ ను నిరూపించుకో వడంతో ఎంతదూరం వచ్చారు. 

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల జోరు పెరుగుతుండడంతో అందరిలాగానే మెగా హీరోలు కూడా తమకు పాన్ ఇండియా మార్కెట్ ఇమేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లుఅర్జున్ రామ్ చరణ్ తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేయగా మిగతా వారు కూడా హిందీలో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ కూడా ప్రయత్నించగా వారికి ఎందుకు కలిసి రాలేదు. 

మెగాస్టార్ చిరంజీవి కొన్ని సినిమాలు హిందీలో ట్రై చేసి అవి వర్కవుట్ కాకా టాలీవుడ్ లోనే కొనసాగారు. ఆ తర్వాత రామ్ చరణ్ జంజీర్ సినిమాను రీమేక్ చేసి ఫ్లాప్ ను ఎదుర్కొని తిరిగి టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు వారి బాటలోనే హీరో వరుణ్ తేజ్ కూడా బాలీవుడ్ లో సినిమా చేసి   పాపులారిటీ దక్కించుకోవాలని చూస్తున్నాడు.  ఈ నేపథ్యంలో పెదనాన్న అన్నయ్య కు సాధ్యం కానిది వరుణ్ తేజ్ కి సాధ్యమవుతుందా అన్న సందేహాలు మెగా అభిమానులు వెళ్ళ బరుస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల కాగా దానికి మంచి స్పందన దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: