సినిమాలలోకి ఎక్కువగా ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అయితే వారికి లక్ కలిసొస్తే ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్లుగా మారుతుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఎంత ప్రయత్నించినా హీరోయిన్ గా గుర్తింపు పొందలేక పోతూ ఉంటారు. అలాంటివారు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు షామిలీ కూడా ఒకరు. అయితే తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకుంది. అది ఎలానో తెలుసుకుందాం..

షామిలీ అంటే ఎవరికీ పెద్దగా  తెలియకపోవచ్చు.. కానీ బేబీ షామిలీ అంటే అందరు గుర్తుపడతారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. షామిలి 1989 లో"రాజండమ్" అనే సినిమాతో తమిళ్ లో చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే తరుణంలో 1990 సంవత్సరంలో మణిరత్నం తీసిన "అంజలి "అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి గాను తను నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది.

షామిలీ దాదాపుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా  42 సినిమాల్లో నటించింది. ఇక అప్పట్లోనే ఈమె స్టార్ హీరోలు సైతం అందుకనే పారితోషకం తీసుకునేది. ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించి బాగా  గుర్తింపు పొందింది. ఇక హీరోయిన్ గా నటించాలని తన మొదటి సినిమా"ఓయ్" సినిమాలో సిద్ధార్థ్ తో  కలిసి నటించగా.. ఈమె వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఈమె తెలుగులో మళ్లీ నటించలేదు.

కోలీవుడ్ స్టార్ ధనుష్  తో కలిసి"కోడి" అనే సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించడానికి ప్రయత్నించగా.. షూటింగ్ కి సరిగ్గా రాకపోవడంతో, అంతేకాకుండా ఈమె కొన్ని కండిషన్ లు పెట్టడం వల్ల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారట. దాంతో ఈ అవకాశాన్ని కూడా చేతులారా పోగొట్టుకుంది. ఇక తన అక్క షాలిని కూడా మంచి హీరోయిన్ గా పేరు పొంది, ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక తన అక్క ( షాలిని) హీరో అజిత్ ను పెళ్లి  చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన సపోర్టుతో అయినా షామిలి హీరోయిన్ కాలేకపోయింది. దీనికి బలమైన కారణం ఏమిటంటే తన బిహేవియర్ తోనే తన సినీ జీవితాన్ని నాశనం చేసుకుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: