పెళ్లిచూపులు మూవీతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే విజయ్ దేవరకొండ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత వచ్చిన ద్వారక మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ద్వారక మూవీ ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. అలాంటి సమయంలో కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో అర్జున్ రెడ్డి సినిమా చేసాడు. ఆ సినిమాతో విజయ్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా ఊహించని దిశలో విజయం సాధించింది. ఆ సినిమాతో విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మోస్ట్ డిసైరబుల్ మాన్ గా విజయ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. సందీప్ వంగ అందించిన మంచి కథ, స్క్రీన్ ప్లే ఆ సినిమా అద్భుత విజయం సాధించేలా చేసింది. అర్జున్ రెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందంటే ఇతర భాషలలో కూడా రీమేక్ అయి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాయి. విజయ్ దేవరకొండకు ఓవర్ నైట్ స్టార్ ఇమజ్ అర్జున్ రెడ్డి సినిమా తీసుకొని వచ్చింది. విజయ్ తరువాత పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. సుమారు 70 కోట్లకు పైగా వసూళ్ళు చేసింది
.విజయ్ పెళ్లి చూపులు సినిమాకు ముందు నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలిసి నటించాడు. ఆ సినిమా విజయ్ కు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చింది. తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటిలో కూడా మంచి పాత్ర పోషించాడు.ఇది ఇలా ఉండగా స్టార్ హీరోల సరసన చేరాలంటే మాస్ ఇమేజ్ ఉండాలని గుర్తించిన విజయ్ మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి లైగర్ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఏ హీరోని అయిన మాస్ లుక్ లో చూపించే పూరిజగన్నాథ్ విజయ్ ని ఎలా చూపిస్తాడో చూడాలి. ఇది ఇలా ఉంటే స్టైలిష్ డైరెక్టర్ అయిన సుకుమార్ తో తన తరువాత మూవీ ఉండబోతుంది అని ఆ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అని విజయ్ ప్రకటించాడు. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయిన కియారా అద్వానీ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. హీరోలను స్టైలిష్ లుక్ లో చూపించే సుకుమార్ విజయ్ ని ఎలా చూపుస్తాడో చూడాలి. సుకుమార్ ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా పుష్ప అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే విజయ్ దేవరకొండతో మూవీని అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి