వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న నాలుగు సినిమాలలో రెండు సినిమాలు చివరిదశ షూటింగ్ కు చేరగా ఒక సినిమా దాదాపు సగం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరొక సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలను ఇంత త్వరగా షూటింగ్ చేయడం ఒక్క ప్రభాస్ కే చెల్లింది. సాహో తర్వాత ఆయన నటించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో ఓవైపు అభిమానులు ప్రభాస్ ను వెండితెరపై చూడాలన్న కోరికతో దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈనేపథ్యంలో ప్రభాస్ కలుగజేసుకుని రాధేశ్యామ్ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడికి ఆదేశించగా ఆ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది.  త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమా షెడ్యుల్ కి షెడ్యుల్ కి మధ్య గ్యాప్ లోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా 80 శాతం పూర్తి చేశాడట ప్రభాస్ఈ.  రెండు సినిమాలు చాలా తక్కువ టైమ్ లోనే విడుదల అవుతుండటంతో ప్రభాస్ అభిమానులకు సంతోషం అంతులేకుండా పోయింది. మరికొందరు ఈ రెండు సినిమాలు ఒకే సారి విడుదల కాబోతున్నాయి అని కూడా అంటున్నారు.

గతంలో ఎప్పుడో ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతుండటం చూశాం కానీ ఈ రోజుల్లో ఒక హీరో నటించిన ఒక సినిమా ఒక సంవత్సరానికి ఒకటే విడుదలవడం గగనమై పోతోంది.  ఈ నేపథ్యంలో ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రెండు ప్రభాస్ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతాయి అనేది చూడాలి. రాధే శ్యామ్, సలార్ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవడం కల అని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ సినిమా ను చేయనున్నాడు. ఇందులో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: