బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా పాత్ర కోసం కండలు పెంచాలంటే అది సల్మాన్ఖాన్   తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఎప్పుడూ బాడీ ఫిట్నెస్ విషయంలో డెడికేషన్ చూపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు సల్మాన్ ఖాన్. అయితే ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సల్మాన్ ఖాన్ నటించిన ఎక్త టైగర్ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది


 ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే మరికొన్ని రోజుల్లో సల్మాన్ ఖాన్ టైగర్ 3 కోసం సిద్ధమవుతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి బాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది  ఇటీవల సల్మాన్ ఖాన్ పెట్టిన పోస్ట్ కాస్త ఇది నిజమే అన్న దానికి నిదర్శనం గా మారిపోయింది. ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు సల్మాన్ ఖాన్. తన వ్యాయామ సెషన్ వీడియోను పోస్ట్ చేశారు ఇక ఈ వీడియోలో విండో ఫేసులో జిమ్ లో ఉన్న సల్మాన్ ఖాన్ ప్రతిబింబం చూడవచ్చు. ఈ క్రమంలోనే తన ఆర్మ్ ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించాడు. నరాల మొత్తం తేలి తిరిగిపోయి ఉన్నాయ్. ఇక కండలు పెంచేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు సల్మాన్ ఖాన్.



 జిమ్ కోచ్ తనకు టైగర్ 3 కోసమే కోచింగ్ ఇస్తున్నట్లు ఉంది అని భావిస్తున్నాను అంటూ ఇక సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియో కి ఒక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక అంతకు ముందు ఇమ్రాన్ హాష్మి కూడా ఏకంగా జిమ్ లో తన సిక్స్ ప్యాక్ దేహాన్ని చూపిస్తూ కనిపించాడు. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఎక్తా టైగర్ సినిమా 2012 లో వచ్చింది. టైగర్ ఫ్రాంచైజీలో ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక రెండో సినిమాగా టైగర్ జిందా హై అనే సినిమా వచ్చింది. ఇక మూడో సినిమాకి ప్రస్తుతం అంతా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 23 వ తేదీ నుంచి టైగర్ 3 షూటింగ్ లో సల్మాన్ ఖాన్ తో పాటు కత్రినా కైఫ్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: