టిక్ టాక్.. ఈ పేరు చెబితే చాలు  యువతులో పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి  కేవలం యువతలో మాత్రమే కాదు అన్ని వయసుల వారు కూడా ఉర్రూతలూగి పోతూ ఉంటారు  ఎందుకంటే ఒకప్పుడు ఒక సాదాసీదా ఎంటర్టైన్మెంట్ యాప్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది టిక్ టాక్.  కానీ తక్కువ సమయంలోనే ఏకంగా భారత ప్రజానీకాన్ని మొత్తం శాసించే స్థాయికి ఎదిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పుడువరకు అంతకుముందు ఇండియన్స్ కనీవినీ ఎరుగని వినూత్న మైన ఎంటర్టైన్మెంట్ ను అందించింది టిక్టాక్.  ఈ క్రమంలోనే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా ఈ యాప్ కి ఎంతగానో కనెక్ట్ అయిపోయారు.


 కనెక్ట్ అయి పోయారు అనడం కంటే ఎడిక్ట్ అయిపోయారు అని చెప్తే సరిగ్గా సరిపోతుంది. టిక్ టాక్ వచ్చిన నాటి నుంచి గంటలతరబడి ఇక టిక్ టాక్ లోనే కాలం గడుపుతూ వచ్చారు. అంతేకాదు టిక్టాక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో టిక్టాక్ ద్వారా ఎంతోమంది కెరియర్ లో సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు.  కానీ ఆ తర్వాత భారత్ చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టిక్ టాక్ యాప్ నిషేధానికి గురైంది. దీంతో ఎంతో మందిని నిరాశ లో మునిగిపోయారు. అయితే టిక్ టాక్ తో పాటు నిషేధానికి గురైన పబ్జీ ఇటీవలే మళ్లీ పబ్జి బాటిల్ గ్రౌండ్స్ ఇండియా అనే పేరుతో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.



 ఈ క్రమంలోనే ఇక మరికొన్ని రోజుల్లో టిక్ టాక్ కూడా భారత్లోకి రాబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే నిజంగానే టిక్టాక్ భారత్ కి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది  tik tok కాస్తా ticktock గా పేరు మార్చుకుని మళ్లీ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకుంది టిక్టాక్. దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులు కోరుతూ దరఖాస్తు చేసుకుంది. అయితే టిక్ టాక్ కి ఎప్పుడు అనుమతి లభిస్తుంది అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.  అనుమతి లభిస్తే మాత్రం టిక్ టాక్ మరికొన్ని రోజుల్లో ఇక ఇండియా లో ఎంట్రీ ఇచ్చి మళ్లీ అందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచ పోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: