తెలుగు సినీ పరిశ్రమలో నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని అసోసియేట్ డైరెక్టర్ గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి అనుకోకుండా హీరోగా మారిపోయి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని నేచురల్ స్టార్ గా మారారు. ఆయన నటించిన 'V' సినిమాతో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర లో అద్భుతంగా నటించి ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి మార్కులు సంపాదించారు. ఈ సినిమా నాని కెరీర్ లో 25వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ మూవీ అంతగా ఏమి లేదు అనే టాక్ వచ్చినా నాని నటన వరకూ ఒకే అనే మాట వినపడింది.

ఇక ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లలోనే విడుదల కానున్నాయి అని సమాచారం. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందింది
అదేవిధంగా ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తున్న నాని త్వరలోనే 50వ సినిమా మైలు రాయిని కూడా అధిగమిస్తాడని సమాచారం. అలాగే ప్రతి సినిమాలో నాని నటనకు వస్తున్న ప్రేక్షకుల రెస్పాన్స్ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన  సినిమా కెరీర్ లో ఎదురైన చాలా ఘటనలను వివరిస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అంతేకాక సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు నాని వివరించారు .

అయితే నిజానికి ఎటువంటి కష్టం లేకుండా పైకి వస్తే కిక్ అస్సలు ఉండదని ఆయన అన్నారు. జీవితంలో కష్టాలు పడి పైకి లేచి వచ్చినప్పుడు మాత్రమే కిక్ ఉంటుందని అయన చెప్పారు. ఇక తాను ఎన్నో కష్టాలు పడ్డాను అని ఎంతో మంది అవమానించినా ఓర్చుకున్నానని ఆయన అన్నారు. ఇక వాటన్నింటికి  ఒక  ప్రతిఫలం దక్కిందని అన్నారు.

ఇక ప్రస్తుతం తన దగ్గర ఉన్నది ఏది కూడా ఈజీగా రాలేదని అన్నారు. అంతేకాదు  ఏదీ కూడా జీవితంలో ఈజీగా రాకూడదు అనేది తన పాలసీ'అని నాని ఎమోషనల్ అయ్యారు. సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే  మంచి నటుడుగా రాణిస్తున్న నాని ఎక్కువ కాలం కొనసాగాకపోవచ్చు అనే మాటలు కూడా చాలా సార్లు వినిపించినట్లు తెలిపారు. కానీ ఎలాంటి అవమానాలు ఎదుర్కొవాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: