విశిష్టాత్మక దర్శకుడు జక్కన్న తాజా చిత్రం "ఆర్ ఆర్ ఆర్ (రణం రౌద్రం రుధిరం). ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలతో అగ్ర దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, ఇటీవలే ఆగస్ట్ ఒకటిన ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి పాట ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌ ఇలా ప్రతి ఒక్కటి ఈ చిత్రంపై అంచనాలను అంతకంతకు పెంచేశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో కూడా ఈ మూవీ రికార్డులు తిరగరాస్తుంది అని సినీ చరిత్రలో ఒక అద్భుతంగా దృవ తారలా విరాజిల్లుతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
మరి ఇన్ని భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎటువంటి అద్బుత ఫలితాలను అందుకుంటుందో చూడాలి. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.   ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ లు ఈ సినిమాలో హీరోయిన్ లుగా చేస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెలుగు, హింది, తమిళ్, మలయాళ భాషలలో అక్టోబర్‌ 13న  విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే .  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనువిందు చేయబోతుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నారు. డివివి దానయ్య నిర్మాణంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
సినిమా ఇది వరకు రాజమౌళి తీసిన సినెమాలన్నింటి కన్నా మిన్నగా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే కీలక సన్నివేశం అన్నిటినికంటే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇప్పటి వరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇది వాటి సరసన నిలవడానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఆఖరి పాటను చిత్రీకరించడానికి ఉక్రెయిన్ లో చిత్ర బృందం ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు నిన్నటి నుండి వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే...  

మరింత సమాచారం తెలుసుకోండి: