ప్రస్తుతం గత రెండు వారాలుగా టాలీవుడ్ లో సినిమా థియేటర్లలో సినిమాలు విడుదల అవుతున్నాయి. కన్నడ నేపథ్యంలో సినిమా థియేటర్లు మూసివేయబడ్డ గా ఇటీవలే కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఆయా సినిమాల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమాలను ప్రేక్షకులు ముందుకు థియేటర్లలో తీసుకురావడానికి భయపడిపోతున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతున్న నేపథ్యంలో వాటికి సరైన ఫలితం అందటం లేదనే చెప్పాలి.

ముఖ్యంగా నిర్మాతలు అయితే ఎక్కడ తమకు భారీ నష్టం వాటిల్లుతుందో అని ధియేటర్ అంటే చాలు వణికి పోతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమాల నిర్మాతలు భారీ నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయే విధంగా ఉన్నారు. చిన్న బడ్జెట్ సినిమాలే అయితే పర్వాలేదు కానీ పెద్ద బడ్జెట్ సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నిర్మాత మరింత అప్పుల్లో కూరుకు పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ టైంలో ఎలాంటి రిస్క్ లు చేయవద్దని చాలామంది ఓటీటీలకు వెళ్లి పోతున్నారట. 

పెద్ద హీరోలే ప్రేక్షకులు రాక సినిమాలను ఓ టీ టీ లలో వేసుకుంటే చిన్న సినిమాలు ఇలా చేయడం ఏమిటో సినిమా విశ్లేషకులకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. డబ్బులు రాకుండా పర్వాలేదు అనుకునేవారికి సరే కానీ తర్వాత సినిమాలు చేయాలి అనే ఆకాంక్షతో సినిమా మీద ప్యాషన్తో సినిమాలు తీసిన నిర్మాతలు ఇలా రిలీజ్ చేయడం వారి భవిష్యత్తు పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. యాక్షన్ హీరో గోపీచంద్ , నేచురల్ స్టార్ నాని,  అక్కినేని నాగచైతన్య,  దగ్గుబాటి రానా వీరి సినిమా లు అన్నీ ఓటీ టీ లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి టాలీవుడ్ సినిమా థియేటర్ ల భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

OTT