బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ఇప్పటి వరకు..సక్సెస్ ఫుల్ గా 4 సీజన్ లను కంప్లీట్ చేసుకున్నది. ప్రస్తుతం ఇప్పుడు ఐదవ సీజన్ రాబోతోంది. సీజన్ ఫోర్ లో పాల్గొన్న అటువంటి కంటెస్టెంట్స్, అప్పటివరకు వారు కూడా యాక్టర్స్ అనే విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి వారిలో యాక్టర్ దివి కూడా ఒకరు.


నటి దివి ఎన్నో సినిమాలలో నటించినా, ఆమెకు పెద్ద గుర్తింపు రాలేకపోయింది. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఆమె అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తన అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసి, అందులో ఎటువంటి కష్టం పడకపోయినా బిగ్ బాస్ షోలో  ఫేస్ టు ఫేస్ మాట్లాడడం తోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

అలా మాట్లాడడం వల్ల ఆమె అందులో నుంచి బయటికి వచ్చింది. ఈమెకు వెబ్ సిరీస్ లోను, సినిమాలలో కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే క్యాబ్ అనే స్టోరీలో హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ బ్యూటీ మరొక చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమా తీసిన దర్శకుడు,"కళ్యాణ్ కృష్ణ" డైరెక్షన్లో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ లో ఈమెను తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఈ సిరీస్ కు కథ ను కళ్యాణ్ కృష్ణ నే అందించడమే గాక, ఈ సీరీస్ కి నిర్మాత కూడా ఆయనే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాల కోసం మనం మరో కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. అయితే బిగ్ బాస్ లో పాల్గొన్నటువంటి స్టార్స్ , అందులో నుంచి ఇంటికి వచ్చాక, బాగా పాపులర్ అయి, సినిమాలో నటించే అవకాశాలను గతంలో కూడా చాలా మంది పొందారు. ఏది ఏమైనా బిగ్ బాస్  వల్ల ఎంతో కొంత మంది స్టార్ గా గుర్తింపు పొందుతున్నారు. అంతేకాదు అవకాశాలు కూడా ఎక్కువగా పొందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: