సాధారణంగా ఇప్పుడు కాలంలో రైతులకు పెట్టుబడి కింద ప్రభుత్వాలు కొంత డబ్బు ఇస్తున్నప్పటికీ, అది కేవలం ఆ రైతులకు ఎటుచాలని పరిస్థితిలో ఉన్నారు. ఇక అంతే కాకుండా అధిక ధరలు పెరగడంతో ఎక్కువ మోతాదులో ఖర్చు అవుతున్నది. అందుచేతనే రైతులు అప్పులపాలవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక మెగా అభిమాని ఒక రైతన్నకు సహాయం చేశాడు.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


పూర్తి వివరాల్లోకి వెళితే..మెగాస్టార్ అభిమాని నుంచి ప్రొడ్యూసర్ గా ఎదిగిన వ్యక్తి S.K.N శ్రీనివాస్ కుమార్. ఈయన మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికీ ముందుగా తెలియజేస్తుంటారు. అలాంటి ఆయన తాజాగా ఒక రైతుకి సహాయం అందించారు. ఆ యువరైతు తన కష్టాలను చెప్పుకుంటూ ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.


తను ఒక భూమిని కౌలుకు తీసుకున్నట్లు అందుకోసం పెట్టుబడి కింద ఏడు వేల రూపాయలను ఖర్చు చేశాను.. మరొక 7000 రూపాయలు దున్నించడానికి అవుతుంది. ఎక్కడ అడిగినా కూడా డబ్బులు పుట్టడం లేదు.. తెలిసిన వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు అన్నా.. అంటూ మెగా ఫ్యాన్స్ అందరిని వేడుకున్నాడు ఆ రైతు. అందులోనే తన మొబైల్ నెంబర్ ను కూడా ఎంటర్ చేసి షేర్ చేశారు.


ఆ ట్విట్టర్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం బాగానే రియాక్ట్ అవుతున్నారు. అని ఎస్.కే.ఎన్ స్పందించి. ఆ యువరైతు కి అవసరమైన డబ్బును తన గూగుల్ పే ద్వారా చెల్లించాడు. అలా సహాయం చేయడం చేత పలువురి ప్రశంసలు పొందుతున్నాడు ఈయనా.. ఈయన ఈ రోజుల్లో, టాక్సీవాలా వంటి సినిమాలకు ప్రొడ్యూసర్ గా నిర్వహించారు. ఇక ప్రతి రోజూ పండుగే లాంటి కొన్ని సినిమాలకు ఓ ప్రొడ్యూసర్ గా నిర్వహించారు.

ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అభిమానుల అంటే ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేస్తూ ఉంటేనే సమాజం ముందడుగు వేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: