మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పని చేయాలని ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. ఆయన సినిమాలలో చేస్తే స్టార్లు కానివారు స్టార్లు అవ్వచ్చు, ఆల్రెడీ స్టార్లు అయిన వారు ఇంకా స్టార్ డమ్ ను పొందవచ్చు అని భావిస్తుంటారు. అందుకే ఆయన సినిమాలలో మళ్లీ మళ్లీ నటించాలని భావిస్తూ ఉంటారు నటీనటులు. ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో హీరోయిన్లు పడితే వారికి కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది వారి నమ్మకం.

త్రివిక్రమ్ కూడా వారి నమ్మకాలకు తగ్గట్లుగా వారితో రెండేసి మూడేసి సినిమాలను చేస్తూ ఉంటాడు. ఏ దర్శకుడైనా ఒక హీరోయిన్ తో సినిమా చేసిన తర్వాత అదే హీరోయిన్ తో వెంటనే మరో సినిమా చేయడానికి ఇష్టపడడు. కానీ త్రివిక్ర మ్ మాత్రం వరుసగా మూడు నాలుగు సినిమాలను ఒకే హీరోయిన్ తో చేసి తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో వరుసగా మూడు సినిమాలలో నటిస్తుంది హీరోయిన్ పూజా హెగ్డే. ముకుంద సినిమా సిని మా ఇండస్ట్రీ లో కి ప్రవేశించిన ఆమె కు మొదట్లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ కు ఓ మంచి సినిమా తో తో రాగా ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె త్రివిక్రమ్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేసింది. తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. దానికోసం ఆమెకు భారీ పారితోషికాన్ని ఇప్పిస్తున్నాడట. త్రివిక్రమ్ తో హీరోయిన్ లు ఇలా వరుస సినిమాలు చేయడానికి ఇది కారణం ఇది అన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: