టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారు ఇప్పుడు తమ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. కొన్ని సినిమాలలో మాత్రమే నటించి స్టార్ హీరోయిన్ గా ఎదగ లేకపోయినా వారు సైతం సినిమా లలో తమ సత్తా చాటుతున్నారు. ఆ విధంగా సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితాన్ని జీవించిన రాశి ఇప్పుడు మళ్ళీ సినిమాల లో బిజీ కావాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో ఆమె నటించినా అవేవి ఫలితాలను ఇవ్వలేదు.

దాంతో బుల్లితెరపై సీరియల్ లలో నటించడానికి వెళ్ళింది. ఇప్పుడు సినిమాల్లో సైతం నటించడానికి చూస్తుంది. అయితే సినిమా అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టినా కూడా దర్శకనిర్మాతలు ఎవరు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దాంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి ఇప్పటికీ తన లో నటించగల సత్తా ఉందని, తనకు నటన పై ఇంట్రెస్ట్ ఉందని డైరెక్టుగా దర్శకనిర్మాతలకు సిగ్నల్ ఇస్తుంది. అయినా ఆమెకు సీరియల్ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అప్పట్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది.

పెళ్లి తర్వాత పదిహేను సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇతర నటులతో మంచి మంచి పాత్రల కోసం పోటీ పడుతుంది కానీ ఈ భారీ కాంపిటీషన్ మధ్య ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఏ పాత్ర అయినా చేస్తాను అని చెప్పిన ఏ దర్శకుడు కూడా ఆమెకు ఆఫర్ ఇవ్వట్లేదు. దాంతో నిర్మాతగా మారి ఓ సీరియల్ చేస్తుంది. గతంలో రాశి తన భర్త ను దర్శకుడిగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసింది. రెండు సినిమాలను నిర్మించింది. ఆ సినిమాలు భారీ ఫ్లాప్ అవడంతో నష్టపోయింది. దాంతో పూర్తిగా ఆర్థిక సమస్యలు తలెత్తాయి. వాటి నుంచి బయటికి కోలుకోవాలంటే ఆమె నటిగా బిజీ కావాలి. అందుకే ఆమె సినిమా ప్రయత్నాలు బాగా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: