కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంకా జవాల్కర్ లు హీరో,హీరోయిన్లుగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కించబడిన సూపర్ హిట్ మూవీ 'ఎస్.ఆర్.కళ్యాణ మండపం' 'ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్' బ్యానర్ పై రాజు మరియు ప్రమోద్‌లు నిర్మించడం జరిగింది.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పని చేసాడు. సాయి కుమార్ ముఖ్య పాత్రను పోషించి మెప్పించాడు.ఈ చిత్రం ఆగష్ట్ 6న థియేటర్ లలో విడుదలై సందడి చేసింది. ముందు నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడడంతో ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సవిజయవంతమైన మూవీగా నిలిచిందని సమాచారం.

అతి తక్కువ బడ్జెట్ చిత్రాలను ఎటువంటి సందేహం లేకుండా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చు అని చాలా మంది దర్శకనిర్మాతలకు భరోసా ఇచ్చిన చిత్రమే SR కల్యాణ మండపం చిత్రమని అందరు అనుకుంటున్నట్లు సమాచారం.ఒకవేళ ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మరింతగా మంచి కలెక్షన్స్ సాధించేది అనడంలో ఎలాంటి అనుమానం లేదని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ చిత్రం అతి త్వరలో ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఆగష్ట్ 27 నుండీ ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ కాబోతుంది 'ఎస్.ఆర్.కళ్యాణమండపం'.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

అంటే సినిమా విడుదలైన 3 వారాలకే ఈ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతుందని సమాచారం.'కలర్ ఫోటో', 'క్రాక్','కుడి ఎడమైతే', 'నాంది' వంటి విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతున్న ఆహా OTT ప్లాట్ ఫామ్ లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' కూడా విడుదల కాబోతుండడం మంచి విశేషం.రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ సాధించడం విశేషం అని అందరు భావిస్తున్నారు మరి ott లో ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: