మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో కలిపి మొత్తం నాలుగు సినిమాలను చేస్తున్నాడు ప్రస్తుతం. వీటిలో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన అచార్య సినిమా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుంది చిత్రబృందం. ఇకపోతే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడు.

వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఇప్పటికే మ్యూజిక్ పనులు పూర్తిచేసింది చిత్రబృందం. తమన్ సంగీతం అందిస్తుండగా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. గాడ్ ఫాదర్ అనే టైటిల్  ఆలోచిస్తున్నారు. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం సినిమా రీమేక్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా గాడ్ ఫాదర్ సినిమాకి సమాంతరంగా తెరకెక్కుతోందని అంటున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు చిరంజీవి. 

ఇలా నాలుగు భారీ చిత్రాలతో త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలో మెగా స్టార్ కి ఈ సినిమా దర్శకులు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.  ఆగస్ట్ 22 న చిరంజీవి పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఆ ఆరోజు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్  ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని వారు భావిస్తున్నారట. మరి ఈ అప్ డేట్ లు మెగా స్టార్ ను, మెగా స్టార్ అభిమానులకు ఎంతగా ఖుషీ చేస్తాయో చూడాలి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్తులో చేయబోయే మరిన్ని సినిమాల అప్డేట్లు కూడా ఆరోజు రాబోతున్నాయని చెబుతున్నారు. మరి మెగాస్టార్

మరింత సమాచారం తెలుసుకోండి: