ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మరికొన్ని రోజుల్లో మనముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా. బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేస్తుంది బోర్ కొట్టి ఫీల్ అవుతున్న ప్రేక్షకులారా, ఇక మీకు ప్రతి రోజు ఎంటర్టైన్మెంట్ ప్లస్సే అంటూ హోరెత్తిస్తున్న ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే సీజన్ 3, 4 లకు హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే ఈసారి సీజన్ 5 కి కూడా హోస్ట్ గా చేయనున్న విషయం విదితమే. అయితే నిన్న మొన్నటి వరకు వినిపించని ఓ సర్ప్రైజ్ న్యూస్ నేడు మనముందుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచేందుకు నాగ్ తో పాటు శ్రీముఖి కూడా స్టేజ్ పై కనపడబోతోందట.
లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేజ్ పై క్లాస్ లుక్ లో కనిపించే నాగ్ పక్కన సౌండ్ బాక్స్ లాగా శ్రీముఖి ప్రేక్షకుల్ని మరింత అలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి షో స్టార్ట్ అయితే కానీ అసలు విషయం తెలియదు. కానీ బిగ్ సీజన్ లో నాగ్ క్లాస్ కి శ్రీముఖి అల్లరి తోడైతే ఇక రచ్చ రచ్చే అంటున్నారు ఈ వార్త విన్న నెటిజన్లు. మరి ఏమౌతుందో చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 3 లో హౌజ్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత ఎంత పాపులారిటీ సంపాదించుకుందో తెలిసిందే. స్టేజి పై ఈమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మాములుగా ఎంటర్ టైన్మెంట్ డోస్ ఎక్కువగా కోరుకునే వారికి శ్రీముఖి అల్లరి ఆ గొడవ నచ్చుతుందని ఈ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఆ తర్వాత స్టార్ మా లో పలు షో లు చేసిన శ్రీ. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి యాంకరింగ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: