ప్రస్తుతం పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించబోతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో వీరిద్దరూ మొట్టమొదటిసారిగా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్ బయటకు రావడం జరిగింది. ఇక అందులో ఈ స్టార్ హీరో ల లుక్స్ అదుర్స్ అంటున్నారు అభిమానులు.. ఇక అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మొన్న ఒక టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. అందుకుపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది .

ఇక టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్, లైక్ అందుకొని  పవన్ కళ్యాణ్ ఒక రికార్డును క్రియేట్ చేశాడు.దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకి డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా,  దర్శకులు వివి.వినాయక ఒక మెయిన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ద్వారా ఈయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వివి వినాయక్ మాట్లాడుతూ.."ఇక ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో  నేను చేయలేదు.. వివి వినాయక్ ఎలా ఉంటాడో..? తన క్యారెక్టర్ ఏమిటో..?  ఈ  సినిమాలో చూపించపోతున్నారు. అది  కేవలం ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంటుంది. అది కూడా రానాతోనే వుంటుంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా గత నెలలో  పూర్తి అయినట్లు"  చెప్పుకొచ్చాడు వివి.వినాయక్ .

ఇక ఆ సన్నివేశం ఏమిటంటే"పోయి పోయి అలాంటి వాడితో పెట్టుకున్నావ్ ఏమిటి..?"అనే  డైలాగ్ రానాతో చూపించారట. ఈ డైలాగ్.. ఆ సమయానికి , ఆ సీన్  రావడంతో కచ్చితంగా సినిమా థియేటర్లలో విజిల్స్ పడతాయి అని చెప్పుకొచ్చాడు వివి వినాయక్. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ కూడా మాటలు అందిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ సినిమాకి డైలాగులు త్రివిక్రమ్ రాస్తే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ చెప్పడం చేత, నిర్మాతలు త్రివిక్రమ్ ని ఈ సినిమాలో కి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా..? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమా విడుదల అవుతున్నా,  అవేమి పట్టించుకోకుండా ఈ నిర్మాతలు సంక్రాంతి బరిలో విడుదల చేయాలని చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: