అన్నయ్య ఫ్యామిలీ  హీరోలు ఈ మధ్య చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. అంత ఇమేజ్ ఉన్నా కూడా లాస్ కాక తప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వేసవిలో విడుదలకా కావాల్సింది.. కానీ.. కరోనా కారణంగా పోస్ట్‌పోన్ కాక తప్పలేదు. దీంతో దాదాపుగా 130 కోట్ల బిజినెస్ పడిపోయింది. ఇక రామ్ చరణ్‌ సినీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం 'ట్రిపుల్ ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంగా  తెరకెక్కుతోన్న ఈ సినమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా.. చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాడు. ఈ చిత్రం దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమా 2021 సంక్రాంతికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా అక్టోబర్‌కి వాయిదా పడింది.
 
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారి చేస్తోన్న హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకత్వంలో ఔరంగజేబు కాలంనాటి కథాంశంగా తెరకెక్కుతోందీ సినిమా. దాదాపుగా 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌ని పాన్‌ ఇండియన్‌ మూవీగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకోవాల్సింది. కానీ కరోనా లాక్‌డౌన్‌తో నెమ్మదించింది.

బాలకృష్ణ, రవితేజ లాంటి హీరోల పేర్లని టచ్‌ చేసి ఫైనల్‌గా పవన్ కళ్యాణ్, రానాని చేరింది 'భీమ్లానాయక్'. మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. సాగర్‌.కె.చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ 70 కోట్లకి పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. కరోనా వేవ్స్‌తో ఈ మూవీ షూటింగ్‌కి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.

ఇక అల్లు అర్జున్ రగ్గడ్‌ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తోన్న సినిమా 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో మల్టీలింగ్వల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్స్‌తో ఈ మూవీ షూటింగ్‌కి చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ఇక 'పుష్ప పార్ట్1' ఈ క్రిస్మస్‌కి విడుదల అవుతోంది. వరుణ్ తేజ్ 'గని, ఎఫ్-3' సినిమాలు, వైష్ణవ్‌తేజ్, క్రిష్ మూవీకి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ సినిమాల వాల్యూ 100 కోట్ల వరకు ఉండే అవకాశముంది. మొత్తానికి అన్నయ్య ఫ్యామిలీకి వెయ్యికోట్ల నష్టం జరిగిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: