మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. ఆచార్య సినిమా తరువాత మెహర్ రమేష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల ఈ సినిమా ఒకటి. చాలా రోజుల తర్వాత మెహర్ మెగాఫోన్ పట్టుకుని చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో భారీ ఫ్లాప్ లను అందుకున్న కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై మరొకసారి నమ్మకం ఉంచి ఈ సినిమా అవకాశం ఇచ్చాడు. దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన రీమేక్ సబ్జెక్టును ఎంచుకోవడం విశేషం.

తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదళం సినిమాను తెలుగులో భోళా శంకర్ గా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కీలకంగా వచ్చే హీరో చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు  అంతకు ముందు చాలా మంది హీరోయిన్ల పేర్లు ను పరిశీలించినా చివరకు చెల్లెలుగా ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ భారీ రెమ్యునరేషన్ తీసుకోపోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజమని కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కీర్తి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ బ్యూటీ పాత్రలతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చెల్లి గా నటిస్తున్న ఈ సినిమా తనకు ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో అని ఆమె భావిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో సర్కారు వారి పాట సినిమా ఉంది. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. గ్లామర్ పాత్ర కాకపోయినా కొంత ప్రేక్షకులను అలరించే పాత్రలోనే ఆమె నటిస్తుంది. అంతే కాదు మరికొన్ని అగ్ర హీరోల సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈమె ఈ పాత్ర చేయడం ఆ సినిమాల పై ఎలాంటి ఎఫెక్ట్ఉంటుందో అని సి నీ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ప్రతి సినిమా కోసం రెండు కోట్లకు పైగానే పారితోషకం తీసుకునే కీర్తి సురేష్ ఈ సినిమా కోసం మూడు కోట్ల దాకా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: