అంత గొప్ప ఓర్పుతో నిత్యం కృష్ణ ప్రవర్తన ఉండేదని సమాచారం. అందుకే కృష్ణ ఇంతవరకు ఏ దర్శకుడితోనూ గొడవ పడింది లేదట. పైగా సమయానికి కూడా ఎక్కువగా కట్టుబడి ఉండేవారట. ఉదయం తొమ్మిది గంటలకు సినిమా సెట్ లో ఉండి తీరాలి అంటే మేకప్ తో సహా రెడీ అయి పది నిముషాలు ముందే సినిమా సెట్ కి వచ్చేవారట. ఎన్టీఆర్ తర్వాత అంత డెడికేషన్ ఉన్న హీరో ఒక్క కృష్ణ మాత్రమే అని సమాచారం.
రాత్రి షూటింగ్స్ కు కూడా కృష్ణ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాదట. అర్ధరాత్రి అయినా ఆయన ఎప్పుడూ షూటింగ్ అభ్యంతరం చెప్పేవాడు కాదట. అలాగే సెట్ లో దర్శకుడు ఏదైనా సీన్ కోసం ఏమి చేయమని కోరినా 'అలా చేయను, ఇలా చెయ్యను'' అంటూ కృష్ణ నోటి వెంట ఆ మాట ఎప్పుడు రాలేదట. అయితే ఓ దర్శకుడితో మాత్రం కృష్ణకు పెద్ద గొడవ జరిగిందని సమాచారం.
ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ ఆ దర్శకుడి పై చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. అస్సలు ఆ గొడవకు కారణం ఏమిటంటే దర్శకుడు నిర్మాత పై అధికంగా భారం మోపడమని సమాచారం. అంతే కాకుండా చెప్పిన సమయానికి షూటింగ్ ను పూర్తి చేయకపోవడం అలాగే నిర్మాతకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోవడంతో కృష్ణ ఆ దర్శకుడిపై అప్పటికే కోపంగా ఉన్నారట. కృష్ణ ఎప్పుడు అయిన నిర్మాతలు మెచ్చే హీరో అని తెలుస్తుంది. తన నిర్మాత ఒత్తిడితో భయపడుతున్నాడు అంటే ఆయన చూస్తూ ఉండలేరట.
ఆ రోజు సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుందట.ఆ షూటింగ్ లో కృష్ణతో పాటు హీరోయిన్ జయప్రద కూడా ఉందని సమాచారం. ఆమెకు వేరే సినిమా షూటింగ్ ఉందట.
కనుక కృష్ణ సినిమాకి ఆమె ఒకరోజు కాల్షీట్ మాత్రమే ఇచ్చిందట. ఆ రోజు ఆమె కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలి. కానీ దర్శకుడు మాత్రం ఆమెకు సంబందించిన సీన్స్ ను షూట్ చేయకుండా సమయం వృధా చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడని సమాచారం.
ఆ దర్శకుడి ప్రవర్తనకు నిర్మాత ఆందోళన చెందాదట.మళ్ళీ జయప్రదను మరో రోజు షూటింగ్ కోసం బుక్ చేస్తే బడ్జెట్ పెరుగుతుందని చెప్పారట. ఇప్పటికే సినిమాకి ఎక్కువ బడ్జెట్ అయిందని అనుకున్నారట. కానీ ఈ విషయం అందరికి తెలిస్తే సినిమాకి నష్టం వస్తుంది ఏమో అని లోలోపలే నలిగిపోతున్నాడట ఆ నిర్మాత. అది గమనించిన కృష్ణ ఆ డైరెక్టర్ పై సీరియస్ అయ్యాదట. ముందుగా జయప్రద సీన్స్ ను కృష్ణగారే స్వయంగా షూట్ చేశారట.ఒక్కరోజులోనే జయప్రద సీన్స్ ను షూట్ చేసి పూర్తి చేసేశారని సమాచారం.కృష్ణలో ఒక దర్శకుడు దాగి ఉన్నాడని అందరికి అప్పుడే తెలిసిందని సమాచారం. అందరికి అప్పుడే తెలిసిందని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి