తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో లేటెస్ట్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది.ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఐదవ సీజన్ తో ఆడియన్స్ ముందుకు రానుంది.అసలైతే ఎప్పుడో ఈ షో స్టార్ట్ కావాలి, కానీ కరోనా వలన కాస్త ఆలస్యం అయ్యింది.ఇక బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభించే ముహూర్తాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు నాగార్జున తో ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది.ఇక ఈ షో సెప్టెంబర్ 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తాజాగా మరో ప్రోమోను విడుదల చేసారు.

ఇక మరోసారి ఐదవ సీజన్ ని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.ఇక ఈ సీజన్లో ఎక్కువ మంది లేడీ కంటెస్టెంట్స్ ఉండనున్నట్లు సమాచారం.షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అంతా ఆగస్ట్ 26 నుండి కోవిడ్ ప్రోటోకాల్స్ లో భాగంగా క్వారంటైన్ లో ఉంచడానికి అన్నీ సిద్ధం చేసారట.దాదాపు అక్కడే 15 రోజుల పాటూ క్వారంటైన్ లో ఉండి.. ఆ తర్వాత సెప్టెంబర్ 5 న కంటెస్టెంట్స్ అందరూ  బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి కోవిడ్ టెస్ట్ చేయగా, వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా పలు మీడియా సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.ఇక సీజన్ 5 లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో సందడి చేయడానికి యాంకర్ రవి,హీరోయిన్ ఇషా చావ్లా, లోబో, నవ్య స్వామి,షణ్ముక్ జశ్వంత్, RJ కాజల్, కోయిలమ్మ ఫేమ్ మానస్, VJ సన్నీ, ఆని మాస్టర్, ప్రియ తదితరులు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.అయితే కంటెస్టెంట్స్ వివరాలను సెప్టెంబర్ 5 నే రివీల్ చేస్తారట నిర్వాహకులు. ఇక ఈసారి సీజన్ 5 ని మరింత స్పెషల్ గా,ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం.ఇక గత సీజన్ల కంటే ఈ సీజన్ కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని బిగ్ బాస్ టీమ్ ఈ సీజన్ పై చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: