ఈ సినిమాలలో సెమి న్యూడ్ గా కనిపించడం ఇతరత్రా సన్నివేశాలతో కథానుగుణంగా తన పరిధిమేరకు చేస్తూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని సరిగా అర్ధం చేసుకుని యువ మూక షకీలాకు పోర్న్ స్టార్ అనే తోకను అతికించేశారు. అయితే ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగితే...నిర్దాక్షిణ్యంగా ఆ మాటను ఖండించింది. ఎవరు చెప్పారండీ నేను పోర్న్ స్టార్ అని, పోర్న్ కు నేను చేసే సినిమాలలో ఉండే దానికి తేడా తెలియదా ? అది కూడా తెలియని వారెవ్వరో వాగే మాటలను నేను పట్టించుకోనని కొట్టిపారేసింది. అంతే కాకుండా ఈ పాత్రలు ఎలా వచ్చాయో తెలియచేసింది. నేను ఎవ్వరినీ ఈ పాత్రా ఇమ్మని అడిగింది లేదు. ఆ పాత్రల కోసం వారు చెప్పింది చేసిందీ లేదు.
నా మొదటి సినిమాలో నా నటన నచ్చిన వారు ఆ తర్వాత అదే రకమైన సినిమాలతో నన్ను అప్రోచ్ అయ్యారు, నేను కూడా ఒప్పుకున్నాను. ఎప్పుడూ కూడా నేనేంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాను అనే ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే ఇవి పోర్న్ మూవీస్ కాదు. నా సినిమాలలో నేను విప్పి చూపించలేదు. అలాంటివి ఎప్పడూడూ చేయను కూడా అనే ఖరాఖండీగా చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా నన్ను పోర్న్ స్టార్ అని అనుకోవడం మానేస్తారునై అనుకుంటున్నాను అని ముగించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి