సాధారణంగా సినిమాలోని ఓ పాత్ర కోసం ఐదు గురినో లేక ఓ పది మందినో, లేక ఓ ఇరవై మందినో ఆడిషన్ చేస్తారు. కానీ ఓ దర్శకుడు మాత్రం ఏకంగా 700 మందిని ఆడిషన్ చేసి.. అందులో నుంచి కేవలం 24 మందినే ఎంపిక చేసుకోవడం అంటే అది మాములు విషయం కాదు. అందులోనూ ఆ 24 మందికి కొన్ని నెలల పాటూ వారికి శిక్షణ ఇచ్చి..ఆ తర్వాత సినిమాని మొదలు పెట్టడం అరుదైన విషయమే అని చెప్పాలి.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరూ?ఆ సినిమా ఎంటనేదేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. ఆ డైరెక్టరే సంపత్ నంది.ఆ సినిమా పేరు 'సీటీమార్'.టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో సాగుతోంది.

అయితే కబడ్డీ మీద తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉందని..తాను కూడా కబడ్డీ ఆడానని,అయితే తాను కబడ్డీ ప్రో లీగ్ చూస్తున్నప్పుడు తనకు కబడ్డీ నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఆలోచన వచ్చిందని..ఆ తర్వాత సీటీమార్ కథ రాశానని చెప్పుకొచ్చాడు సంపత్ నంది.అయితే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ గా కనిపించే 24 మందిని సెలెక్ట్ చేయడానికి పడ్డ కష్టం అలాంటి ఇలాంటి కష్టం కాదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సంపత్ నంది.ఈ 24 మందిని ఎంచుకోవడం కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు తెలిపాడు దర్శకుడు.కబడ్డీ మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వారిని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని చెప్పాడు.చివరికి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన..

నలుగురు ప్లేయర్స్ ని ఈ సినిమా కోసం తీసుకున్నామని,అంతేకాకుండా వారికి మూడు నెలలు నటనలో శిక్షణ ఇచ్చి సినిమాలో నటింపజేశామని సంపత్ నంది వెల్లడించారు.ఇక ఆడిషన్ పూర్తయ్యాక కబడ్డీ ట్రెయినింగ్ కోసం సుమారు మూడు నుండి నాలుగు నెలల కేటాయించామని..గేమ్ గురించి లోతుగా తెలుసుకొని ఇక స్పోర్ట్స్ మూవీలా 'సీటీమార్' సినిమాని తీర్చిదిద్దడానికి ప్రయత్నించామని తెలిపాడు.అయితే సినిమాలో కేవలం కబడ్డీ మాత్రమే ఉండదని,అంతకుమించి ఎమోషన్ తో పాటూ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పాడు.ఇక ఇప్పటివరకు తన కెరీర్లో ఎంతో కష్టపడి ఈ సినిమాని తీశానని,కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధిస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు సంపత్ నంది.ఇక థియేటర్ లోనే ఈ సినిమాని విడుదల చేయాలని చాలా రోజులుగా ఎదురుచూసి..ఇప్పుడు సెప్టెంబర్ 3 న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపాడు ఈ సినిమా దర్శకుడు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: