ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సీజన్ల నుంచి ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఈ కార్యక్రమం.  ఇక ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు డాన్స్ తో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఢీ షో ఇప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  ప్రతివారం కామెడీ షో కంటే ఎక్కువగా ఈ డాన్స్ షో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అని చెప్పాలి.



 ఢీ షోలో భాగంగా ఒక వైపు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ టీం లీడర్ లుగా ఉండగా.. మరోవైపు రష్మి, దీపిక పిల్లి టీం లీడర్ గా కొనసాగుతున్నారు.  ఇక ప్రదీప్ తనదైన యాంకరింగ్ తో రక్తి కట్టిస్తూ ఉన్నాడు. ఇక ఈ నలుగురు కూడా కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అనే రెండు టీములుగా విడిపోయారు. ఇక ఢీ షో లో భాగంగా వీళ్ళు అందరూ చేసే కామెడీ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఒక్కసారి స్టేజి మీదకు చేరుకున్నారు అంటే ఒకరి పై ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు.  ఇకపోతే ఇటీవలే వచ్చేవారం ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ ప్రోమో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ ప్రోమో లో భాగంగా  ఏకంగా క్వీన్స్ టీమ్ లీడర్స్ గా ఉన్న రష్మీ, దీపిక పిల్లి  హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ లాగా మారిపోయారు. ఇక ఈ ఇద్దరూ ఆ ఇద్దరిని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించారు. హైపర్ ఆది లాగా మారిపోయిన దీపిక పిల్లి అటు ఆది ప్రియమణితో ఎలా రొమాంటిక్గా మాట్లాడతాడు అనే విషయాన్ని ఇమిటేట్ చేసింది. ఈక్రమంలోనే ఆది పాత్రలో ఏకంగా ప్రియమణి నుంచి హగ్ కూడా తీసుకుంది  దీపిక. ఇక ఆ తర్వాత సుధీర్ ని ఇమిటేట్ చేసిన రష్మి..  పూర్ణని ఎలా కామెంట్ చేస్తాడు ఇక పూర్ణ కిస్ ఇవ్వబోతే ఎలా సిగ్గుపడ్డాడు అన్న విషయాన్ని చూపించి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: