ఈరోజు సాయి పల్లవి ఫోటోలను తన సోదరి పూజ తీయడంతో , సాయి పల్లవి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చక్కగా ఎండను , గాలిని ఆస్వాదిస్తూ ఉన్నట్లు, పగడపు రంగు చీరలో మెరిసిపోతూ అద్భుతంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలను చూసిన సాయిపల్లవి అభిమానులు ఆశ్చర్యం తో పాటు ఆనందం లో కూడా మునిగిపోతున్నారు. ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే, ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
.png)
ఈ సినిమాను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేస్తామని చెప్పినప్పటికీ , కొన్ని మిస్టేక్ లో ఉండడంతో సినిమాను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఆరోజు థియేటర్లలో విడుదల కానుంది. అంతే కాదు నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలో కూడా సాయిపల్లవి నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిన విషయం తెలిసిందే..
.png)
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి