అయితే ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ ఏదైనా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర వచ్చిందంటే చాలు ఇక కాదు అనకుండా చేస్తూ ఉంటారు విజయ్ సేతుపతి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి అలరించారు. ఇక ఇటీవలే మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా విలన్గా నటించారు విజయ్ సేతుపతి. ఇక తన నటనతో పాత్రకు ప్రాణం పోశారు అనే చెప్పాలి. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉంటూ.. పరువు కోసం కులం కోసం ప్రాణాలు సైతం తీయడానికి ఇక ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి రాయణం పాత్రలో నటించారు విజయ్ సేతుపతి.
ఈ సినిమాలో తండ్రీ కూతురు పాత్రలో నటించిన విజయ్ సేతుపతి, కృతి శెట్టి ఎమోషన్ కూడా చాలా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. తమిళ్ లో మీతో కలిసి కృతి శెట్టి ఒక సినిమా చేసే ఆఫర్ వస్తే వద్దు అన్నారంట కదా ఎందుకు అని ప్రశ్నంచగా.. ఉప్పెన సినిమా చేస్తున్నప్పుడు నేను కృతి శెట్టి నా కూతురు గా భావించా.. నా కొడుకు 15 సంవత్సరాలు ఉంటాడు నువ్వు ఓ 18 సంవత్సరాలు ఉంటావు నన్ను తండ్రిలా భావించి ఎలాంటి సిగ్గుపడకుండా యాంక్టింగ్ చేయి అని ఆ అమ్మాయికి చెప్పాను. అలా చెప్పిన వాడిని మళ్లీ అదే అమ్మాయి తో ఇప్పుడు ఎలా రొమాన్స్ చేస్తాను. చేయలేను అంటూ చెప్పారు విజయ్ సేతుపతి. ఒక సినిమా కాదు ఇక నా సినీ కెరీర్ మొత్తంలో కూడా ఆమెతో రొమాంటిక్ పాత్రలు చేయను అంటూ చెప్పి ఆయనపై ఉన్న గౌరవాన్ని మరింత పెంచుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి