టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోగా అక్కినేని నాగార్జునకు మంచి సక్సెస్ రేటు ఉంది. ఆయన గత కొన్ని సినిమాలు విజయాలు దక్కించుకోవడం లేదు కానీ అంతకు ముందు వరుస సక్సెస్ లతో పెద్ద పెద్ద సినిమాలను చేస్తూ వెళ్ళాడు. ప్రస్తుతం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే సినిమాను ఆయన ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటీవలే నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా అది ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ లుక్ సినిమా పై కూడా భారీ అంచనాలు పెంచింది. ఇకపోతే అక్కినేని నాగార్జున ఇదే సమయంలో మరొక సినిమాని కూడా పట్టా లెక్కించాడు. ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య తో కలసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఇది సీక్వెల్ అంటున్నారు.

ఇక  రెండు సినిమాలు తెరకెక్కుతూ వుండగానే ఆయన తన తదుపరి సినిమాల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. మరి కొన్ని సినిమాలను ఒప్పుకునే దిశగా ఆయన కథలు వింటున్నాడన తెలుస్తుంది.  అయితే అక్కినేని నాగార్జున విషయంలో ఓ సెంటిమెంట్ రిపీట్ అయినప్పుడల్లా ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఇప్పుడు అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఆయన ఏ సినిమాలో అయినా డ్యూయల్ రోల్ చేస్తే అది తప్పకుండా హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశ. ఈ నేపథ్యంలో బంగార్రాజు సినిమా లో ఆయన ద్విపాత్రాభినయం చేస్తుండగా ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే అటు తనయుల సినిమాలు, ఇటు తన సినిమాలు మరో వైపు బుల్లితెర పై చేస్తూ నాగార్జున గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: