ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన తెరకెక్కించే సినిమాలలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. సినిమా తీస్తే చూసిన వారికి ఒక సంతృప్తి ఉంటుంది. అంతలా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఎక్కువగా మనుషుల్లోని వాస్తవాలను వెలికితీసే విధంగా తేజ సినిమాలు ఉంటాయి. తేజ సినిమా కెరియర్ బాలీవుడ్ లో మొదలయింది. ముందుగా చాలా సినిమాలకు హిందీలో కథలు అందించాడు, మాటలు అందించాడు మరియు సినిమాటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేశాడు. తేజ కూడా రామ్ గోపాల్ వర్మ టీమ్ నుండి వచ్చినవాడు కావడం గమనార్హం. అందుకే ఎక్కువగా ఇతని సినిమాల్లో హింస ఉంటుంది.
తెలుగులో తాను తెరకెక్కించిన "చిత్రం" మూవీ ఎంత ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో డెబ్యూ హీరో ఉదయ కిరణ్ మరియు రీమాసేన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తరువాత హీరోయిన్ రీమాసేన్ కు మరియు "చిత్రం" కు మ్యూజిక్ అందించిన ఆర్ పి పట్నాయక్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. కానీ హీరోగా చేసిన ఉదయ్ కిరణ్ కు మాత్రం అవకాశాలు రావడం లేదు. అయితే అప్పటికి తనకు తెలిసిన డైరెక్టర్ ఒక్క తేజ మాత్రమే అందుకే రోజూ తన ఆఫీస్ కు వెళ్ళే వాడట. ఆ సమయంలో తేజ నువ్వు నేను కథను సిద్దం చేసుకుని నటీనటుల కోసం వెతికే పనిలో పడ్డాడు.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొంత మందిని పిలిచి స్క్రీన్ టెస్ట్ చేశాడట అందులో ఒక అమ్మాయి బాగుందని ఆమెను ఓకె చేశాడట తేజ. అయితే ఆ అమ్మాయి పెట్టిన కండీషన్ కు మదిలో ఒక ఆలోచన వచ్చిందట. అదేంటి సినిమా హిట్ అవవడానికి కథ బాగుండాలి కానీ, నేనేంటి అమ్మాయి అందంగా ఉండాలి, పొడవుగా ఉండాలి అని అనుకుంటున్నాను అని నా సినిమాకు హీరోయిన్ ఎలా ఉన్నా సరే నా కథే సినిమాకు హీరో అని అక్కడున్న అమ్మాయిల్లో బాగా లేని ఒక అమ్మాయిని చూపించి ఆ అమ్మాయే నా సినిమాలో హీరోయిన్ అని చెప్పి, ముందు కండిషన్స్ పెట్టిన అమ్మాయిని వెళ్ళిపొమ్మని చెప్పాడట తేజ. అలా మొదటి సారి ఆ అమ్మాయి పెట్టిన షరతులకు సినిమాలో నటించే నటీనటులపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడట. హీరో లేదా హీరోయిన్ ఎవరైనా పర్వాలేదు. కథ బాగుంటే అదే ఆడుద్ది అని నమ్మిన డైరెక్టర్ లలో తేజ ముందు వరుసలో ఉంటాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి