ఇక ప్రముఖ
హీరో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు
సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి
యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఇక ఆ న్యూస్ ప్రస్తుతం నెట్టింట అలాగే
ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ గా మారింది. ప్రమాదం అయ్యిన చోటే అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్కి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్సని డాక్టర్లు అందిస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని యావత్ సినీ లోకం కూడా ప్రార్థిస్తోంది. మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అపోలో హాస్పిటల్కు చేరుకొని
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు.సాయికి
యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మెగా అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ఇక అలాగే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా త్వరగా కోలుకోవాలని సోషల్
మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు. అలాగే కొంతమంది సాయిని పరామర్శించి వస్తున్నారు.
ఇక తాజాగా సాయి
యాక్సిడెంట్ పై నట్టి
కుమార్ స్పందించారు.సాయి ధరమ్ తేజ్ గారు త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అందరితో కలవాలని ఏసు ప్రభువుని కోరుకుందాం అని అన్నారు.సినిమా వాళ్లంతా కూడా దేవునికి ప్రార్ధన చేద్దాం అన్నారు.అలాగే సాయి గురించి
నరేష్ గారు చేసిన కామెంట్స్ ఏమాత్రం నచ్చలేదని చెప్పారు. సాయి రేసింగ్ చెయ్యలేదని ఆయన నార్మల్ గానే వెళ్లారని నట్టి
కుమార్ అన్నారు. దయచేసి రాజకీయాలు చెయ్యొద్దని చెప్పారు.సాయి దుర్గమ్మ చెరువు మీద వెళుతుండగా దురదృష్టవశాత్తు ఇసుక ఉండటం వల్ల అక్కడ స్కిడ్ అయ్యి పడిపోయారని రేసింగ్ చెయ్యలేదని దయచేసి ఈ టైంలో రాజకీయాలు చెయ్యొద్దని నట్టి
కుమార్ అన్నారు.సాయి మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన కానీ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అలాగే తన నటనతో సినిమాలతో ముఖ్యంగా డాన్స్ తో అభిమానులని సంపాదించుకున్నాడు.