.png)
శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ ద్వారా అమ్మమ్మ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ కింద ఇలా రాసింది .. అమ్మమ్మ అంటేనే నాకు ఎనలేని ప్రేమ.. నా జీవితంలో ఎన్నో విషయాలను నాకు నేర్పించింది..ఎప్పుడూ చాలా హుషారుగా , సంతోషంగా ఉండేది.. తనతో పాటు నాకు కూడా ఎప్పుడూ సంతోషాన్ని పంచేది.. తాను ధైర్యవంతురాలు మాత్రమే కాదు బోల్డ్ అలాగే బ్యూటిఫుల్ కూడా.. అమ్మమ్మతో నేను పాటలు పాడడం, డాన్స్ చేయడం లాంటివన్నీ మిస్ అవుతున్నాను.. లవ్ యు అమ్మమ్మ.. నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ధన్యవాదాలు.. నా జీవితంలో నేను విన్న ప్రేమకథల్లో మా అమ్మమ్మ.. తాతయ్యల.. ప్రేమ కథ ఒకటి. అయితే మీరు స్వర్గంలో మీ ప్రేమ కథను తిరిగి కొనసాగించాలని ఆశిస్తున్నాను అంటూ శ్రీముఖి తెలిపింది.
ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శ్రీముఖి అమ్మమ్మ కు సంతాపం కూడా తెలుపుతున్నారు..
ఇక ఒకవైపు శ్రీముఖి ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి అనుకున్న లోపే మరోవైపు ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఇక ఉత్తేజ్ కూడా భార్య వియోగం పొంది, తీవ్ర దుఃఖానికి లోనవుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి