టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గరకు రావడంతో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు, అలాగే తాను తదుపరి చేయబోయే సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

 నాగ చైతన్య ప్రస్తుతం 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనితో పాటే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తూ, నిర్మిస్తున్న 'లాల్ సింగ్ ఛాద్దా' సినిమాలో కూడా నాగ చైతన్య ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో వెబ్ థ్రిల్లర్ తో 'ఓటిటి' లోకి ఎంట్రీ ఇవ్వనున్నరట, ఈ విషయాన్ని నాగ చైతన్య తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
నాగ చైతన్య 'ఓ టి టి' గురించి మాట్లాడుతూ.. తాను రాబోయే రోజుల్లో సినిమాలతో పాటు 'ఓ టీ టీ' ప్రాజెక్టులలో కూడా నటించాలని ఆసక్తి ఉన్నట్లు తెలియజేశాడు.
అలాగే 'లాల్ సింగ్ చద్దా' సినిమా గురించి మాట్లాడుతూ.. నేను 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశాడు.
ఇలా నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: