అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నెత్తీ నోరు బాదుకుంటున్నా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తమ ఇద్దరి మధ్య ఏం లేదు.. తాము  ప్రాణ స్నేహితులం అంతకుమించి ఎక్కువ ఊహించుకోవద్దు. అని స్టేట్ మెంట్స్ ఇస్తోంది కానీ గాసిప్ రాయుళ్లు నమ్మడం లేదు. జాన్వీ ఆ కుర్రాడితో లవ్‌లో ఉందని కామెంట్స్ పెడుతూనే ఉన్నారు.

బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ పేరు సినిమాల కంటే ఎక్కువగా లవ్‌ ఎఫైర్స్‌లోనే  వినిపిస్తోంది. జాన్వీ ఆ హీరోతో రిలేషన్‌లో ఉంది, ఈ హీరోతో లవ్‌లో ఉందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. 'ధడక్‌' సినిమా సమయంలో ఇషాన్ ఖట్టర్‌తో లవ్‌లో పడిందని ముంబయిలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ ఫ్రెండ్స్‌ అని చెప్పి.. ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు.

జాన్వీ కపూర్‌ 'దోస్తానా2' షూటింగ్‌ సమయంలో కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో పడిందనే మాటలు వినిపించాయి. ఇక ఇద్దరూ కలిసి 2021 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి గోవా వెళ్లడంతో వీళ్ల రిలేషన్‌పై మరిన్ని కామెంట్స్ వచ్చాయి. అయితే మధ్యలోనే ఈ ప్రేమకథకి ఫుల్‌స్టాప్ పడింది. ఈ బ్రేకప్ తర్వాత 'దోస్తానా2' నుంచి కార్తీక్ ఆర్యన్‌ని తప్పించాడు కరణ్‌ జోహార్.

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం అక్షత్‌ రాజన్‌తో ప్రేమలో ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. జాన్వీ రీసెంట్‌గా అక్షయ్‌ బర్త్‌డేకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టింది. 'హ్యపీ బర్త్‌డే టు ద వరల్డ్స్‌ బెస్ట్‌ హ్యూమన్.. ఐ లవ్‌ వ్యూ అక్షత్ రాజన్' అని ఒక ఫోటో షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్‌ కనిపించడం ఆలస్యం జాన్వీ లవ్‌లో ఉందని కన్ఫర్మ్ చేస్తున్నారు.

ఇంతకుముందు కూడా జాన్వీ కపూర్, అక్షత్ రాజన్ లవ్‌లో ఉన్నారనే మాటలు వినిపించాయి. అప్పుడు ఈ  ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది జాన్వీ. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇలాంటి మాటలతో అక్షత్ నన్ను కలవడానికి కూడా భయపడుతున్నాడని బాధపడింది. మళ్లీ ఈ పోస్ట్‌ కనిపించగానే సోషల్‌ మీడియాలో లవ్‌ స్టోరీస్‌ రెడీ అయిపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: