బాలీవుడ్ ఐటమ్ గాళ్ ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడి మాజీ భార్య మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె యాభై కి చేరువలో ఉన్నా ఇప్పటికీ కూడా హాట్ గా ఫిట్ గా ఉండి యువతరంలో మంటలు రేపుతోన్న సంగతి తెలిసిందే.తన భర్త నుంచి దూరం అయ్యాక తనకంటే పదేళ్ల చిన్నవాడైన బాలీవుడ్ యంగ్ హీరో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూనే .. మరోవైపు తన ఇన్ స్టాలో లేటెస్ట్ హాట్ టెంప్టింగ్ ఫోటో షూట్లతో విరుచుకుపడుతూ అందరి చూపులను ఇంకా వారి అటెన్షన్ ని తనవైపు తిప్పేసుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.ఇక మలైకా అరోరా తాజా లుక్ ప్రస్తుతం యువతరంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈమె బ్లూ డెనిమ్స్ షార్ట్ వేసుకొని దానికి కాంబినేషన్ గా వైట్ ఫ్రాక్ ని ముడివేసి తన హాట్నెస్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచిన తీరు బాగా వేడెక్కిస్తోంది.
 

ఇక ఈ స్పెషల్ డిజైనర్ బట్టల కోసం మలైక ఏకంగా 4లక్షల బడ్జెట్ వెచ్చించిందని సమాచారం. ఇక అంతేగాక 3.5 లక్షల విలువైన బొట్టెగా వెనెటా క్లచ్  హీల్స్ తో కనిపించిందంటూ ఒకటే బాలీవుడ్ టౌన్ లో గుసగుస నడుస్తోంది.ఇంకా బొట్టెగా వెనెటా మినీ జోడీ లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమవ్వడం జరిగింది.ఇక దీని ధర వచ్చేసి అక్షరాలా రూ. 2.7 లక్షలు అలాగే ఆమె తెల్లని పాడెడ్ హీల్స్ ధర వచ్చేసి రూ. 75 వేలు.ఇక నిన్న సాయంత్రం తన ప్రియుడు అర్జున్ కపూర్ చేతిని పట్టుకుని మలైక ఓ రెస్టారెంట్ వద్ద ఇలా హాట్ అండ్ కాస్ట్లీ గా కనిపించింది. ప్యాడ్డ్ హీల్స్ తో స్టైల్ చేసిన బొట్టెగా వెనెటా నుండి కొత్త క్లచ్  తో డిజైనర్ లుక్ లో మలైక తన హాట్ నెస్ తో బాగా వేడెక్కించడం జరిగింది. ఇక ఈ గెటప్ లో హై స్ట్రీట్ లగ్జరీ స్టైల్  తో ఎంతగానో ఆకట్టుకుంది.ఇక మలైకా ఆ రెస్టారెంట్ నుంచి అలా వెళుతుంటే అందరి కళ్లన్నీ అటువైపే వెళ్ళి నిలిచాయంటే దానివెనక ఎంతటి ప్రిపరేషన్ ఉందో అర్థం అవుతుంది.ఇక మలైకా ధరించే ప్రతి బ్రాండ్ కి కూడా చాలా పబ్లిసిటీ అనేది దక్కుతోంది.ఇక అంతే కాదండోయ్ దానికి ప్రతిగా భారీ పారితోషికం కూడా అందుకుంటోంది ఈ హాట్ బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: