ఇప్పటికీ నాగార్జున టాలీవుడ్ మన్మథుడిగానే కనిపిస్తున్నాడని తెలుస్తుంది. రొమాంటిక్ చిత్రాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం నాగార్జున దిఘోస్ట్ అనే చిత్రంతో పాటు బంగార్రాజు అనే చిత్రం చేస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనా చిత్ర ప్రీక్వెల్‌గా రూపొందుతుందన్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమాలో నాగచైతన్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయానికి వస్తే మొదటగా కృతి శెట్టిని ఎంపిక చేయడం జరిగిందని సమాచారం.


ఈ సినిమాలో కృతి శెట్టి కాకుండా మరో నలుగురు అందగత్తెలు కూడా ఉంటారని యూనిట్ వర్గాల ద్వార వార్త అందుతోందని సమాచారం.సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం అందరికి తెల్సిందే. ఆ పాత్రను ఆమె కంటిన్యూ చేయబోతున్నట్లుగా సమాచారం. బంగార్రాజు సినిమాలో రమ్యకృష్ణ పాత్ర డ్యూరేషన్ కొద్ది సేపే ఉంటుందని తెలుస్తుంది.

ఆమె పాత్ర ను తగ్గించి ఇతర హీరోయిన్స్ తో ఆ లోటును భర్తీ చేస్తారనే వార్త వినిపిస్తుంది.. స్వర్గంకు చెందిన సన్నివేశాలను ఈ సినిమాలో చిత్రీకరించబోతున్నారని సమాచారం. కథానుసారంగా కాస్త ఎక్కువ సమయమే స్వర్గం గురించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. బంగార్రాజు భూమి మీదకు వచ్చిన తర్వాత కూడా స్వర్గం నుండి వచ్చిన రంభ ఊర్వసి మేనకలు ఆయన వెంట ఉంటారని తెలుస్తుంది

సినిమాలో కృతి శెట్టి మరియు రమ్యకృష్ణ లు మాత్రమే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ అయిన మోనాల్ గజ్జర్ ను ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తుంది.. ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుందని అంటున్నట్లు సమాచారం. మోనాల్ తర్వాత వేదిక మరియు మీనాక్షి చౌదరిలలను కూడా ఈ సినిమాలో నటింపజేస్తున్నారని తెలుస్తుంది.. ఈ అయిదుగురు ముద్దుగుమ్మలు బంగార్రాజు వెయిట్ పెంచడంతో పాటు రంగులు అద్దడం ఖాయం అంటున్నారని సమాచారం..

ఐదుగురు భామలతో బంగార్రాజు చేసే సందడి సరికొత్తగా ఉంటుందని తెలుస్తుంది.ప్రేక్షకులకి సరైన వినోదం పంచుతుందని చెబుతున్నట్లు సమాచారం..ఏదేమైన తాత వయస్సులో నాగార్జున రొమాన్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: