స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. విలక్షణ కథల దర్శకుడు అయిన ఎస్.జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారన్న విషయం అందరికి తెలిసిందే.ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారని సమాచారం

2001 సంవత్సరంలో విడుదలైన ఖుషి సినిమా యువకులను హృదయాలను గెలుచుకుందని తెలుస్తుంది. రొటీన్ కథే అయినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుందని సమాచారం. తమిళంలో ఖుషి సినిమాలో దళపతి విజయ్ మరియు జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించిన విషయం అందరికి తెలిసిందే.

తమిళంలో ఖుషి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో తెలుగులో ఈ సినిమాను అంతే గ్రాండ్ గా నిర్మించాలని ఈ సినిమా నిర్మాత ఎ.ఎం. రత్నం అనుకున్నారని తెలుస్తోంది.ఎస్ జె సూర్య పవన్ తో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాలని భాష రాకపోయినా ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఖుషి సినిమాకు ముందు పవన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయని సమాచారం. అందువల్ల ఖుషి సినిమాపై సాధారణంగానే అంచనాలు భారీగా పెరిగాయని తెలుస్తుంది.

నిజానికి తమిళంలో ఖుషి విడుదల కాకముందే తెలుగులో ఖుషి సినిమా మొదలైందని తెలుస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదని సమాచారం. ఆ తర్వాత తమిళంలో ఖుషి విడుదల కావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం ను సొంతం చేసుకోవడం జరిగాయని సమాచారం. సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తుంది. సాధారణ కథే అయినా కథనం ఆసక్తికరంగా ఉండటం వల్ల ఖుషి మూవీ విజయం సాధించిందని తెలుస్తుంది.

హీరో సిద్దు సిద్దార్థ రాయ్ పాత్రకు పవన్ కళ్యాణ్ ప్రాణం పెట్టి చేసారని చెప్పుకోవచ్చు. పవన్ ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని తెలుస్తుంది. మధుమతి అలియాస్ బుజ్జి పాత్రకు భూమిక పూర్తిస్థాయిలో న్యాయం చేసి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: