వరుస భారీ బడ్జెట్ చిత్రాలతో తెలుగునాట సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇటీవల కాలంలో ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలను పెద్ద పెద్ద హీరోలతో చేస్తూ ఇతర నిర్మాతలకు అందకుండా దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు ఇతర భాషలకు సంబంధించిన పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఇతర భాషల్లోని పెద్ద దర్శకులతో కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు.

ఆ క్రమంలోనే ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాను మొదలు పెట్టగా తాజాగా తమిళనాట స్టార్ హీరోగా గొప్ప పేరు ప్రఖ్యాతలు అందుకున్న విజయ్ దళపతి హీరోగా తెరకెక్కే సినిమాను ఆయన మొదలుపెట్టినట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. గత కొన్ని రోజులుగా దర్శకుడు వంశీ పైడిపల్లి దళపతి విజయ్ ల కాంబో సినిమా రాబోతు ఉందని వార్తలు వస్తుండగా ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన పుకార్లను నిజం చేస్తూ దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చేశాడు. ఆయన సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ విషయాన్ని అధికారికంగా చెప్పాడు. మహర్షి చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమా కోసం చాలా ప్రయత్నం చేయగా చివరికి విజయ్ దళపతి ఆ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ కథను మహేష్ బాబు రిజెక్టు చేసిన కథ అని చెబుతున్నారు మహర్షి సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు అవార్డులు అందుకున్న వంశీ పైడిపల్లిసినిమా తో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన మహర్షి సినిమా కు నేషనల్ అవార్డులు రాగా సైమా అవార్డు ఫంక్షన్ లో కూడా ఈ చిత్రం కు అవార్డుల పంట పండింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: