జగపతి బాబు, రమ్యకృష్ణ లు అద్భుతంగా నటించారు అనడం కంటే ప్రాణం పెట్టి జీవించారు అని చెప్పవచ్చు. అలా ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ముందుకు సాగుతోంది. అయితే ఈ చిత్రం లవ్ స్టోరీ చిత్రాలకి గట్టిపోటీ ఇవ్వడం మాత్రమే కాదు దానిని మించి రికార్డ్ సృష్టించేలా ఉంది అంటున్నారు కొందరు ప్రేక్షకులు. లవ్ స్టొరీ చిత్రం ప్రధానంగా యువతను ఆకర్షిస్తుంది. కానీ రిపబ్లిక్ చిత్రం ప్రతి భారతీయుడిని ప్రేరేపించేలా ఉంది ప్రతి పౌరుడు ఖచ్చితంగా చూడాల్సిన ఒక మంచి కథనం అంటున్నారు. అందులోనూ ఈ మధ్యకాలంలో ఇలాంటి కథలతో ఒక సినిమాని తెరకెక్కించడం అనేది పెద్దగా కనిపించలేదు. కానీ దర్శకుడు దేవకట్టా నిజంగా పెద్ద ప్రయోగమే చేశాడు.
అదే కాకుండా రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడం ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు బయటకు తెలియకపోవడంతో ప్రేక్షకుల్లో పెరుగుతోంది. అది కూడా ప్రేక్షకుడిని ఈ సినిమా చూసేందుకు ప్రేరేపించడం ఒక కారణమే అంటున్నారు. అందులోనూ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథ సమకూర్చిన విధానం హైలెట్ గా నిలుస్తోంది...ఇలా అన్ని కలిసొచ్చి ఈ చిత్రానికి హైప్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. అయితే రిపబ్లిక్ సినిమా ప్రభావం ఖచ్చితంగా లవ్ స్టొరీ చిత్రంపై పడనుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు అయితే ఇంకో నాలుగైదు రోజులు గడిస్తే కానీ ఓ క్లారిటీకి రావడం కష్టం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి