నిజానికి రాజమౌళి కూడా తన సినిమాను సంక్రాంతి కానుకగా తీసుకువస్తారని ఎవరు అనుకుని ఉండరు. రూమర్స్ వచ్చిన కూడా అవి పుకార్లు గానే ఉంటాయి అని అందరూ అనుకోగా ఇప్పుడు అదే నిజం అవడం టాలీవుడ్ లో అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఇప్పుడు అదే సమయంలో విడుదల అవుతున్న మిగతా సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. పోస్ట్ ఫోన్ చేసుకోవాలా లేదా అదే సమయంలో విడుదల చేయాలా అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు.
మరోవైపు రాజమౌళి ఈ విడుదలను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేయగా అది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ని కూడా ఎంతో ప్రభావితం చేసింది. ఆ సమయంలో భాగంగా బాలీవుడ్ గంగు భాయ్ కథియవాడి, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలను విడుదల చేయాలని బాలీవుడ్ సిద్ధం అయ్యింది. కానీ రాజమౌళి తన సినిమాను విడుదల చేయడంతో ఆ సినిమాలు వెనక్కి తగ్గక ఉండలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతమందిని బాధపడుతూ రాజమౌళి ఆ రోజున సినిమాను విడుదల చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి