తెలుగు విలక్షణ దర్శకులలో ఒకరైన క్రిష్ జాగర్లమూడి కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చినట్లు  సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. క్రిష్ జాగర్లమూడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టి దాదాపు 50 శాతం వరకు షూటింగ్ ను పూర్తి చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ను ఆపివేసి ఉప్పెన సినిమాతో మంచి విజయం అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం సినిమాను ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలోనే ఈ సినిమాను పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేశాడు. అక్టోబర్ 8 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇంత తొందరగా షూటింగ్  ని  పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ పుట్ కూడా చాలా బాగా వచ్చిందని అనేక మంది క్రిష్ జాగర్లమూడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఇది ఇలా ఉంటే క్రిష్ జాగర్లమూడి మరి కొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఆహా లో ఒక టాక్ షో చేస్తున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆ టాక్ షో కు కూడా క్రిష్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకేసారి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను నందమూరి నట సింహం బాలకృష్ణ  ను దర్శకత్వం వహించే అవకాశం క్రిష్ జాగర్లమూడి కి వచ్చింది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి నందమూరి బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: