అయితే ఇపుడు సామ్, చైతు లు విడిపోవడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. అప్పటి ఫోటోను మళ్ళీ ఇప్పటి పరిస్థితికి జత చేసి సామ్, చైతు లు విడిపోవడానికి కారణం ప్రీటం జువల్కరే నని వీరి మధ్యలోకి వచ్చి అంతా నాశనం చేశాడని విమర్శలు కురిపిస్తూ అంతా మండిపడుతున్న నేపథ్యంలో...ఈ అంశంపై ప్రీతం జువల్కార్ మీడియాతో మాట్లాడారు. సమంత తనకు అక్క లాంటిదని అలాంటిది తను పరిచయం అయినప్పటి నుండి అలాగే పిలుస్తున్నానని..ఆ విషయం నాగ చైతన్యకి కూడా తెలుసని చెప్పుకొచ్చాడు. అక్క తమ్ముళ్ళ బంధంతో చనువుగా మా మధ్య ఏదో ఉందని అంటూ వార్తలు వెల్లువెత్తడం చాలా దారుణమని...ఇంత జరుగుతున్నా నాగ చైతన్య ఈ విషయం పై స్పందించకపోవడం చాలా బాధగా ఉందని తెలిపారు.
సమంత నన్ను ఒక సోదరుడిగా చూస్తుందని తెలిసిన నాగ చైతన్య ఇంత జరుగుతున్నా మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. మా మధ్య ఉన్న బంధం గురించి నాగచైతన్య ఒక స్టేట్మెంట్ ఇస్తే అంత సర్దుకుంటుందని చెప్పుకొచ్చాడు. మరి నాగ చైతన్య ఈ విషయం పై స్పందిస్తారో లేదో చూడాలి. అయితే ఈ విషయంలో చై ఏమైనా స్పందిస్తాడా ఒకవేళ ఏమీ లేకపోతే స్పందించడానికి ఇబ్బంది ఏమిటని అంతా ఆలోచిస్తున్నారు. చైతన్య సమాధానంపైనే ప్రీతం లైఫ్ ఆధారపడి ఉందని ప్రాధేయపడుతున్నాడు. మరి ముందు ముందు ఏమి జరగనుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి